తోబుట్టువు పెళ్లి.. దగ్గరుండి జరిపించిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోదరి దినాల్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది
సూర్య- దేవిశా శెట్టి దంపతులు దగ్గరుండి.. అంతా తామై ఆడపడుచు దినాల్ వివాహం జరిపించారు
ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు
‘‘అందమైన వధువు.. నిన్నిలా చూస్తుంటే నాకు గర్వంగా.. సంతోషంగా ఉంది..
జీవితాంతం నువ్వు ఇలాగే ఆనందంగా వర్ధిల్లుతూ ఉండాలి’’ అని సూర్య ఉద్వేగానికి లోనయ్యాడు


