ఆర్.కె.బీచ్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది
నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బీచ్ ప్రాంతమంతా సందడిగా మారింది
ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లటి సముద్రపు గాలుల మధ్య సందర్శకులు ఉల్లాసంగా గడిపారు
అలాగే ఫిషింగ్ హార్బర్ జెట్టీ 10, 11 వద్ద మత్స్యకార కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు
వారు సముద్రంలో ఉత్సాహంగా డైవ్‌లు చేస్తూ కేరింతలు కొట్టారు


