
గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యు ఘోష వినిపించింది.. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆధ్యాతి్మక నగరి దద్దరిల్లింది.. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి భీతిల్లింది.. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు.. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు.

కిందపడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు.. ప్రాణ భీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు.. వెరసి కనీవినీ ఎరుగని రీతిలో తొక్కిసలాటకు కారణమైంది.. పడిపోయిన వారిని బతికించు కోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది.. ఆ దృశ్యాలు చూపరుల కంట తడిపెట్టించాయి

చంద్రబాబు ప్రభుత్వ పెనునిర్లక్ష్యం మరోసారి అమాయక భక్తుల ప్రాణాలను బలిగొంది. పవిత్ర తిరుమల–తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టుపట్టించిన చంద్రబాబు దుర్మార్గం ఆరుగురు భక్తుల ప్రాణాలను హరించింది

30 మందికిపైగా తీవ్రంగా గాయపడేలా చేసింది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తుల ప్రాణాలతో చలగాటమాడింది

చెల్లాచెదురుగా పడిన అమాయక భక్తుల మృతదేహాలు.. తీవ్రగాయాలపాలైన భక్తుల ఆర్తనాదాలు.. వేలాది మంది భక్తుల హాహాకారాలతో తిరుపతి నగరం హృదయ విదారకంగా మారిపోయింది

రాజకీయ ప్రచారం కోసం, నిరాధార ఆరోపణలతో ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం చంద్రబాబు తిరుమల–తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) వ్యవస్థను భ్రష్టు పట్టించడమే ఇంతటి పెను విషాదానికి దారితీసింది


















































