బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్.
ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రంలో చెర్రీ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా బాలీవుడ్ భామ నైరా బెనర్జీ నటించింది.
ఆమె అసలు పేరు మధురిమ కాగా.. ఆతర్వాత నైరా బెనర్జీగా మార్చుకుంది.
తెలుగులో ఆ ఒక్కడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో సరదాగా కాసేపు, షాడో, వేట, కొత్త జంట,టెంపర్, దోచేయ్ లాంటి సినిమాల్లో నటించింది.
తాజాగా ఈ బ్యూటీ గుర్తుగా లేనంతగా మారిపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.


