అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్టవడం సంచలనం రేపుతోంది.
ఈ కేసులో హీరో ప్రియురాలు పవిత్ర గౌడను సైతం అదుపులోకి తీసుకున్నారు.
పవిత్రకు అసభ్య సందేశాలు పంపుతున్నాడన్న కోపంతో దర్శన్, అతడి గ్యాంగ్‌తో కలిసి అతి క్రూరంగా రేణుకాస్వామిని చంపాడు.
అయితే దర్శన్ ఈ హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాననంది హీరోయిన్ రచితా రామ్.
ఆయన నాకు గురువులాంటివారు. నన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలిచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను.
పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
కాగా రచితా రామ్.. దర్శన్‌తో బుల్‌బుల్, అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి సినిమాల్లో జంటగా నటించారు. కన్నడలో అనేక చిత్రాలు చేసిన ఈమె తెలుగులో సూపర్ మచ్చి మూవీలో మెరిసింది.


