
సినిమా ఇండస్ట్రీకి సవాల్‌గా మారిన పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలోనే అతిపెద్ద ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

సినిమా పైరసీ భారీ రాకెట్‌ను ఛేదించిన నేపథ్యంలో, సీవీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం నిర్వహించారు.

చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశం ద్వారా సినీ పరిశ్రమను రక్షించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి సీపీ వివరించారు.

పైరసీని అరికట్టేందుకు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు వివరించారు.







