హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకుంది.
గోవా వేదికగా వారిద్దరూ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేశారు.
హిందూ సంప్రదాయ పద్ధతిలో కీర్తి పెళ్లి ఘనంగా జరిగింది.
కీర్తి మెడలో ఆంటోనీ మూడుముళ్ల వేయడంతో వారిద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
కీర్తి సురేష్ తన పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఆంటోనీతో ప్రేమ, వివాహం గురించి ఇటీవల కీర్తి ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఒక ఫొటో విడుదల చేసిన ఆమె.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనున్నట్లు తెలిపింది.
కీర్తి భర్త ఆంటోనీ కుటుంబం వ్యాపార రంగంలో రానిస్తుంది.
కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి, ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట.


