శీతాకాలంలో వివిధ ప్రాంతాల నుంచి స్వదేశీ, విదేశీ పక్షులు వలస వస్తున్నా యి.
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్‌లో ఇటీవల నిర్వహించిన బర్డ్‌వాక్‌లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు అరుదైన పక్షులను తమ కెమెరాల్లో బంధించారు.
వీటిలో అరుదైన ఇండియన్ నైట్‌జార్, ఇండియన్ హాక్ ఈగల్ తదితర జాతి పక్షులు ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నైట్‌జార్ పక్షి కేవ లం రాత్రి వేళల్లో మాత్రమే కనిపిస్తుందని, ఇండియ న్ హాక్ ఈగల్ చాలా అరుదైన పక్షి అని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు నాగేశ్వర్‌రావు, నవీన్, రాజేశ్, ప్రశాంత్ తెలిపారు.
తాము చిత్రీకరించిన పక్షులను వారు అటవీశాఖ అధికారులకు విడుదల చేశారు.
ఈ ప్రాంతంలో అరుదైన పక్షులు కనిపించడంపై రేంజ్ అధికారి సుష్మారావు ఆనందం వ్యక్తం చేశారు.


