
సాగరతీరం ఆదివారం కిటకిటలాడింది. పిల్ల్లాపాపలతో కలసి నగర వాసులు ఆర్.కె.బీచ్‌కు తరలివచ్చి ఆనందంగా గడిపారు

సముద్రంలో స్నానాలు చేస్తూ కొందరు, రాళ్లపై నిల్చొని ఫొటోలకు ఫోజులిస్తూ మరికొందరు దర్శనమిచ్చారు

వాయుగుండం ఫలితంగా కొద్ది రోజుల కిందట సముద్రం ముందుకొచ్చింది. ఈ ఆదివారం మాత్రం సముద్రం కాస్త వెనక్కి వెళ్లడం, కెరటాల తీవ్రత తగ్గడంతో రాళ్లు కనిపించాయి

వీటి మధ్యలో చిన్న చేపలు కదులుతూ సందడి చేశాయి. వీటిని చూడటానికి, పట్టుకోవడానికి నగరవాసులు ఉత్సాహం చూపారు

వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో సేదతీరారు. బీచ్ ఫొటోగ్రాఫర్లకు, చిరు వ్యాపారులకు చేతినిండా పని దొరికింది




