
నగరానికి చెందిన హామ్‌స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఇంటీరియర్ ప్రదర్శన ఆకట్టుకుంది. నగరానికి చెందిన దాదాపు 300 మంది యువ ఇంటీరియర్ డిజైనర్లు సృజనాత్మకతతో తీర్చిదిద్దిన ఇంటీరియర్ ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్టింగ్స్, స్టూడియో స్పేస్‌లలో ప్రదర్శించారు.




















