 
							 
							ఈ ఊళ్లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి
 
							జపాన్‌లోని నగోరో గ్రామం బొమ్మల గ్రామంగా పేరు పొందింది
 
							ఒకప్పుడు దాదాపు మూడువందల మంది ఉండేవారు.
 
							ఇప్పుడు కేవలం ముప్పయిమంది మాత్రమే మిగిలారు.
 
							ఊరిలో అందరూ పెద్దవాళ్లే..
 
							పిల్లలు, యువకులు చాలా కాలం క్రితం పట్టణం విడిచిపెట్టారు
 
							ఈ గ్రామంలో పిల్లలు లేకపోవడంతో 2012లోనే పాఠశాల మూతపడింది
 
							ఈ ఊరిలో అడుగడుగునా ఇన్ని బొమ్మలు ఎందుకు..? అసలు కథ
 
							దాదాపు ఇరవయ్యేళ్ల కిందట సుకుమి అయానో తన చిన్నతనంలో చదువుకోవడానికి తన గ్రామాన్ని విడిచిపెట్టింది
 
							కొన్నాళ్లుగా గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన తండ్రిని చూసేందుకు వచ్చింది. ఆమె ఇంట్లో దిష్టిబొమ్మను తయారు చేసి, తన చిన్ననాటి బట్టలు ధరించి ఇంట్లో పెట్టింది.
 
							గ్రామం విడిచి వెళ్లిన మరికొందరు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల బొమ్మలను తయారు చేసి వారి ఇళ్లలో ఉంచింది.
 
							ఈ విధంగా ఆమె దాదాపు నాలుగు వందల బొమ్మలను తయారు చేసింది.
 
							 
							 
							 
							 
							 
							 
							
 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
