
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు సిరిమానుపై విహరించిన వేళ విద్యలనగరమైన విజయనగరం భక్తజనంతో కిక్కిరిసింది

పైడితల్లి నామస్మరణతో దారులన్నీ కిటకిటలాడాయి. మంగళవారం సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సాగిన సిరిమానోత్సవాన్ని దూరం నుంచే తిలకించిన భక్తజనం అమ్మ ఆశీస్సులందుకుంది

ఉత్సవం ఆద్యంతం సంప్రదాయబద్ధంగా సాగింది. ముందు పాలధార, ఆ వెంట జాలరి వల, తెల్ల ఏనుగు, అంజలిరథం వెన్నంటి రాగా అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను భక్తులందరినీ అలరిస్తూ ముందుకు కదిలింది

సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మను దర్శించుకున్నారు

సిరిమానుపై గగనాన విహరించే ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావును అమ్మకు ప్రతిరూపంగా భావించి మొక్కుకున్నారు




























