
నగరంలో దేవీ నవరాత్రుల సందడి షురూ అయింది. గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రుల కోసం ఆయా ఆలయాలు, కాలనీల్లో ఏర్పాట్లు భారీగా చేపట్టారు

ఈమేరకు అమ్మ వారి విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి

ధూల్‌పేట, ఎర్రగడ్డ, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో దేవీ మాత విగ్రహాలు విక్రయిస్తున్నారు. వీటిని భక్తులు కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు



















