
తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి గురువారం సంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు

అమ్మవారి ఆలయ మహద్వారం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక పూలమాలలతో కూడిన సారెను నెత్తిన పెట్టుకొని పార్టీ నేతలతో కలిసి ఆయల ప్రదక్షిణ చేసి అమ్మవారికి సారెను సమర్పించారు

గంగమ్మ తల్లిని దర్శించుకొని పూజలు నిర్వహించారు




















