ఇండోనేషియా సునామీ : 429కి చేరిన మృతుల సంఖ్య

Indonesia tsunami Death toll raises to 429 - Sakshi

జకర్తా : ఇండోనేషియాలో సునామీ మృతుల సంఖ్య 429కి చేరుకోగా, మరో 154మంది జాడ తెలియాల్సి ఉందని ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ అధికారులు ప్రకటించారు. వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో సురక్షిత నివాసాల కోసం పడిగాపులు కాస్తున్నారు. తాగడానికి కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో బాధిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చిన్నపిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు.

సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా ఇండోనేసియాలో  సునామీ సంభవించిన విషయం తెలిసిందే. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్‌ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా గత శనివారం సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది. సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయి.

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top