బరిలో కో‘ఢీ’

TDP leaders disobeyed restrictions of court orders - Sakshi

కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు బేఖాతరు

ఏలూరు టౌన్, అమలాపురం, కంకిపాడు(పెనమలూరు): పోటీలకు పందెం కోడి కత్తులు దూస్తోంది! పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. న్యాయస్థానం ఆదేశాలు, పోలీస్‌ ఆంక్షలను ధిక్కరిస్తూ కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పండుగకు ఒకరోజు ముందే కోడి పందేలకు అంకురార్పణ చేశారు. భారీగా డబ్బులు చేతులు మారటంతో బరులు పందెంరా యుళ్లతో నిండిపోయాయి.

మరోవైపు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజక వర్గంలోనూ కోడి పందేలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ బరికి సన్నద్ధం చేస్తున్నారు.

Back to Top