సోషల్ మీడియాలో విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
న్యూయార్క్:
సోషల్ మీడియాలో విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటలం పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, వేధింపులకు పాల్పడటాన్ని వైఎస్‌ఆర్ సీపీ యూఎస్‌ఏ విభాగం తీవ్రంగా ఖండించింది.
తప‍్పుడు ఆరోపణలతో సోషల్ మీడియా కార్యకర్తలు రవికిరణ్, రవీంద్రలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్ రత్నాకర్ అన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.