కంకుల చుట్టూ ముళ్లుండే రకం జొన్న పంటను సాగు చేస్తూ గడచిన పదేళ్లుగా నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్నారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ గ్రామ రైతులు. గతంలో ఆ గ్రామంలోని రైతులు రబీ పంటగా తెల్ల, ఎర్ర జొన్నలను సాగు చేసేవారు. చెట్లు, బీడు భూములు ఎక్కువగా ఉండటంతో పక్షుల తాకిడి ఎక్కువగా ఉండేది. పంట చేతికొచ్చే సమయంలో ఇవి జొన్న పంటను ఆరగించేసేవి. ఎన్ని పనులున్నా మానుకొని మరీ కుటుంబంలో ఒకరు పగలంతా కావలి కాయాల్సి వచ్చేది. దాదాపు 40 రోజులు ప్రతి రైతు కుటుంబంలోనూ ఒక మనిషి పూర్తిగా ఆ పనికే సమయం కేటాయించాల్సి రావటంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అధిక విస్తీర్ణంలో జొన్న పంటను సాగు చేసే రైతులు పక్షులు పంటపై వాలకుండా చూడటానికి అమితంగా శ్రమించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ముళ్లజొన్న సాగు ఆ గ్రామ రైతుల పాలిట ఆపద్బాంధవిగా మారింది.
ముళ్లజొన్న పంట కాలం నాలుగు నెలలు. ఇది ప్రధానంగా పశుగ్రాసానికి పనికొచ్చే రకం. వెల్కటూర్ రైతులు విత్తన పంటగా సాగు చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు ముళ్లజొన్న విత్తనాలను రైతులకు ఇవ్వటంతో పాటు, సాగు చేసిన పంటను తిరిగి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామంలో ముళ్లజొన్న సాగు క్రమంగా పెరిగి ప్రస్తుతం 600 ఎకరాలకు చేరింది.
ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని అక్టోబర్ ఆఖరివారంలో ప్రతి 18 సాళ్లకు ఒక సాలు చొప్పున మగ విత్తనాన్ని విత్తుకున్నారు. వారం విరామం తర్వాత మధ్య సాళ్లలో ఆడ విత్తనాన్ని విత్తుకున్నారు. కూలీలతో ఒకసారి కలుపు తీయించారు. నాలుగు తడులు ఇచ్చారు. వరికోత మిషన్‌తో పంట నూర్పిడి చేశారు. ముళ్ల జొన్నల తొడిమె నలుపు రంగులోను, గింజ లేత ఎరుపు రంగులోను ఉంటాయి. జొన్న కంకి చుట్టూ ముళ్లు ఉండటం వల్ల పిట్టలు పంటను పాడుచేసేందుకు సాహసిం^è డం లేదు.
ముళ్ల జొన్నలో ఎకరాకు 22 –25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాల్‌కు రూ. 1,800 కనీస ధరగా ఒప్పందం చేసుకొని విత్తన కంపెనీ కొనుగోలు చేస్తున్నది. పచ్చ, తెల్ల జొన్నలు మార్కెట్‌లో క్వింటాలుకు రూ. 2,100 పలుకుతుంటే విత్తన ముళ్ల జొన్నలకు రూ. 100 – 150లు ఎక్కువ ధర రైతులకు అందుతోంది. దుక్కి, ఎరువులు, కూలీలు వంటి ఖర్చులు రూ. 6 వేలు పోను ఎకరాకు రూ. 30 వేల నికరాదాయం రైతులకు లభిస్తోంది. కావలి కాయాల్సిన అవసరం లేకపోవటంతో రైతులు ఇతర పొలం పనులకు సమయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు చీరలు కట్టటం, దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయటం, టపాసులు కాల్చటం వంటి పద్ధతులను గతంలో అనుసరించేవారు. ముళ్లజొన్న సాగు వల్ల రైతులకు ఆ శ్రమ తప్పి, నికరాదాయం పెరిగింది.
– బొమ్మెన భూమేష్, సాక్షి, బాల్కొండ, నిజామాబాద్ జిల్లా
చీడపీడలు రావు,చాకిరీ తక్కువ!
ముళ్లజొన్నలో మంచి దిగుబడి వస్తున్నది. చీడపీడలు రావు. పక్షుల కోసం కావలి కాయాల్సిన అవసరం లేదు. చాకిరీ తక్కువ. అందుకే 10 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నా.
– గుండేటి సాయిరెడ్డి
(99124 75349), ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్ జిల్లా
కంకుల చుట్టూ ముళ్లుంటాయి!
ముళ్ల జొన్న కంకులకు చుట్టూతా ముళ్లు ఉంటాయి. దీంతో పక్షులు కంకులపై వాలాలంటేSభయ పడుతున్నాయి. ముళ్ల జొన్నను పిట్టల నుంచి కాపాడుకోవడానికి కాపలా ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిశ్చింతగా సాగు చేస్తున్నా.
– రాజేశ్వర్ (99124 16865) ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్ జిల్లా
పిట్టలతో ఎలాంటి బాధ లేదు
నిరుడు వరకు ఎర్ర జొన్న పంటను సాగు చేశాను. కాపలా కాయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ఏడాది ముళ్ల జొన్న పంటను సాగు చేశాను. ఇప్పుడు పిట్టలతో ఎలాంటి బాధ లేదు.
– రాజన్న, ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మం., నిజామాబాద్ జిల్లా
కంకుల చుట్టూ ముళ్లు.. కావలికి చెల్లు!
Published Mon, Feb 27 2017 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement