సెన్సెక్స్ కు జోష్, 388 పాయింట్ల లాభం!
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పతనం, ఇరాన్ తో అగ్రరాజ్యాల ఒప్పంద అంశాలు స్టాక్ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పతనం, ఇరాన్ తో అగ్రరాజ్యాల ఒప్పంద అంశాలు స్టాక్ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి. దాంతో ప్రధాన సూచీ 388 పాయింట్లతో లాభపడటం కాకుండా మూడు రోజుల నష్టాలకు ముగింపు పలికింది. సెన్సెక్స్ పెరుగుదలకు కాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, రియాల్టీ, కంపెనీల షేర్లు దోహద పడ్డాయి. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 6115 వద్ద క్లోజైంది.
ఐసీఐసీఐ బ్యాంక్, భెల్ అత్యధికంగా 5 శాతం లాభపడగా, బీపీసీఎల్, కొటాక్ మహేంద్ర, అల్ట్రా టెక్ సిమెంట్ షేర్లు 4 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, హిండాల్కో, లుపిన్ లు స్వల్పంగా నష్టపోయాయి.
బ్యాంకులు, ఎగుమతుదారులు అమెరికా డాలర్ ను అమ్మకాలు జరపడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజి వద్ద ఆరంభంలోనే రూపాయి 31 పైసలు బలపడింది. వివాదస్పద న్యూక్లియర్ కార్యక్రమంపై ఇరాన్, అగ్రరాజ్యాల మధ్య ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ కు వ్యతిరేకంగా యూరో బలపడటం రూపాయి బలపడటానికి కారణం అని ఫారెక్స్ డీలర్స్ తెలిపారు. ప్రస్తుతం 37 పైసల లాభంతో 62.50 వద్ద ముగిసింది.