తనను ప్రేమించడం లేదన్న కోపంతో భూపతి అనే యువకుడు ఓ యువతిని తుపాకితో కాల్చి చంపేశాడు.
ప్రేమ పేరుతో జరుగుతున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం యానాదిలో తనను ప్రేమించడం లేదన్న కోపంతో భూపతి అనే యువకుడు ఓ యువతిని తుపాకితో కాల్చి పారేశాడు.
తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతోనే అతడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.