మీ వాసనే పాస్‌వర్డ్! | your smell may be password | Sakshi
Sakshi News home page

మీ వాసనే పాస్‌వర్డ్!

Feb 15 2014 3:06 AM | Updated on Oct 17 2018 4:36 PM

వేలిముద్రలు.. కనుపాపల స్కానింగ్.. ఫేస్ రికగ్నిషన్.. ఇవన్నీ అత్యంత భద్రమైన ‘పాస్‌వర్డ్’లు.. వ్యక్తుల ‘గుర్తింపు’ కోసం ఉపయోగించే పద్ధతులు. తాజాగా ఈ జాబితాలోకి మన శరీరం వాసన కూడా చేరింది.

న్యూయార్క్: వేలిముద్రలు.. కనుపాపల స్కానింగ్.. ఫేస్ రికగ్నిషన్.. ఇవన్నీ అత్యంత భద్రమైన ‘పాస్‌వర్డ్’లు.. వ్యక్తుల ‘గుర్తింపు’ కోసం ఉపయోగించే పద్ధతులు. తాజాగా ఈ జాబితాలోకి మన శరీరం వాసన కూడా చేరింది. శారీరక లక్షణాల కారణంగా ప్రపంచంలోని వ్యక్తులందరికీ.. ఎవరిది వారికే ప్రత్యేకమైన వాసన ఉంటుంది. దాని ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన పరికరాలను స్పెయిన్‌కు చెందిన డి మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ పరికరాలు 85 శాతం కచ్చితత్వంతో పనిచేస్తున్నాయని వారు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement