మీరా పేరు ముందే చెప్పలేదేం? | wyh oppn party should've nominated Meira Kumar earlier, UP CM | Sakshi
Sakshi News home page

మీరా పేరు ముందే చెప్పలేదేం?

Jun 23 2017 6:38 PM | Updated on Aug 25 2018 4:19 PM

మీరా పేరు ముందే చెప్పలేదేం? - Sakshi

మీరా పేరు ముందే చెప్పలేదేం?

లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపడం ద్వారా విపక్షాలు దళితులను అవమానపర్చాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ విమర్శించారు.

- విపక్షాలు దళితులను అవమానించాయన్న యూపీ సీఎం
న్యూఢిల్లీ:
లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపడం ద్వారా విపక్షాలు దళితులను అవమానపర్చాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ ఘట్టంలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ, ఇతర విపక్షాలకు దళితులంటే ప్రేమ ఉండుంటే తమ అభ్యర్థిగా మీరా కుమార్‌ పేరును ముందే ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడు పేరు వెల్లడించడం దళితులను అవమానించినట్లు కదా?’ అని ఆదిత్యనాథ్‌ మండిపడ్డారు.

కోవింద్‌ సమర్థతకు ఇదే నిదర్శనం: వెంకయ్య
ఎన్డీఏ భాగస్వామి కాకపోయినప్పటికీ జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు పలికిందని, తద్వారా ఆయన(కోవింద్‌) విపక్షాలకు కూడా ఆమోదయోగ్యమైన వారనే విషయం నిరూపణ అయిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement