వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు | woman hair chopped off for having extra marital relation | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

Oct 13 2016 11:05 AM | Updated on Sep 4 2017 5:05 PM

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

వివాహేతర సంబంధం ఉందని..జుట్టు కత్తిరింపు

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో ఒక మహిళ జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు.

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో ఒక మహిళ జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అప్పటికే పెళ్లయిన ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై కులపెద్దలు పంచాయతీ పెట్టారు.

అందులో ఆమె తప్పు చేసిందని తేల్చి.. అందుకు పరిహారంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో ఆమె భర్తను పిలిచి, అతడితోనే బలవంతంగా ఆమె జుట్టును మెడ వరకు కత్తిరింపజేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. అక్రమంగా కోర్టు నిర్వహించి, తీర్పులు చెప్పినందుకు ముగ్గురిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement