వివాహేతర సంబంధం బయటపడుతుందని.. | Woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం బయటపడుతుందని..

Aug 23 2015 8:32 PM | Updated on Sep 3 2017 8:00 AM

వివాహేతర సంబంధం బయటపడుతుందని..

వివాహేతర సంబంధం బయటపడుతుందని..

వివాహేతర సంబంధం విషయం ఎక్కడ బంధువులకు, గ్రామస్తులకు తెలుస్తుందోనన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది.

జైపూర్: వివాహేతర సంబంధం విషయం ఎక్కడ బంధువులకు, గ్రామస్తులకు తెలుస్తుందోనన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. వివాహిత మహిళ సునిత జాట్ (40) తిమార్పూర్ గ్రామంలో నివసిస్తోంది. అదే గ్రామంలో నివసిస్తున్న చిమాన్ తకూర్ (40)తో గతకొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ వివాహేతర సంబంధం విషయం అక్కడి గ్రామస్తులకు ఎక్కడ తెలుస్తోందనని ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది.
 
ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకునేలా తకూర్ ప్రేరేపించాడంటూ అతనిపై ఫిర్యాదు చేశాడు. నిందితుడు తకూర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు తకూర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement