హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఒకప్పటి జనతా పార్టీకి చెందిన వర్గాలు మరింత సన్నిహితమయ్యాయి.
న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఒకప్పటి జనతా పార్టీకి చెందిన వర్గాలు మరింత సన్నిహితమయ్యాయి. ఆసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేయాలని జనతాదళ్ యునెటైడ్ (జేడీయూ), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ) సోమవారం నిర్ణయించుకున్నాయి.
మాజీ ఉపప్రధాని చౌధరీ దేవీలాల్ కాలంనుంచీ, తమ రెండు పార్టీలకూ సత్సంబంధాలున్నాయని, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తిరిగి ఏకంకావాలన్నదే తమ ప్రయత్నమని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెప్పారు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులకు ఇదొక హెచ్చరికలాంటిదని యాదవ్ తెలిపారు.