అమరావతి నిర్మాణంలో మేము సైతం... | We also in amaravathi | Sakshi
Sakshi News home page

అమరావతి నిర్మాణంలో మేము సైతం...

Oct 17 2015 3:44 AM | Updated on Aug 18 2018 3:49 PM

అమరావతి నిర్మాణంలో మేము సైతం... - Sakshi

అమరావతి నిర్మాణంలో మేము సైతం...

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో కర్ణాటకలోని తెలుగు వారందరూ భాగస్వాములు కావాలని తెలుగు విజ్ఞాన

♦ బెంగళూరు నుంచి ఐదు వేల ఇటుకలు
♦ శ్రీరంగపట్టణం నుంచి త్రివేణి సంగమ జలాలు, పుట్టమన్ను
♦ అందరూ భాగస్వాములు కావాలని తెలుగు విజ్ఞాన సమితి పిలుపు
 
 బెంగళూరు(బనశంకరి) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో కర్ణాటకలోని తెలుగు వారందరూ భాగస్వాములు కావాలని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధకృష్ణరాజు పిలుపునిచ్చారు.  శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు   ‘నా ఇటుక నా అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు బెంగళూరు నుంచి అమరావతి నిర్మాణానికి 5 వేల ఇటుకలను పంపుతున్నట్లు తెలిపారు.

అలాగే  ప్రవాసాంధ్రుడు వేదమూర్తి...  శ్రీరంగపట్టణం నుంచి త్రివేణిసంగమ పవిత్రజలాలతో పాటు పుట్టమట్టిని తీసుకెళుతున్నట్లు వివరించారు. కర్ణాటక తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రుక్మాంగదనాయుడు మాట్లాడుతూ..... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అకుంఠితదీక్షతో చేపడుతున్న రాజధాని నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 22 తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఒక ఇటుక అందించి భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో  కర్ణాటక తెలుగుదేశం పార్టీ బెంగళూరు కన్వీనర్  రావి మోహన్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement