Telugu Vignan council
-
హాస్యం అపహాస్యం కాకూడదనేదే నా లక్ష్యం: కమెడియన్ అలీ
హాస్యం అనేది అపహాస్యం కారాదని ప్రముఖ తెలుగు నటుడు అలీ అన్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో 70వ ఉగాది ఉత్సవాలు - శ్రీకృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అలీతో పాటు కన్నడ రంగస్థల నటుడు సరిగమ విజీ, విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్, ప్రిన్స్ రామవర్మ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా అలీ ప్రసంగిస్తూ ప్రజలను నవ్వించడమే నా తపన అన్నారు. అయితే హాస్యం అపహాస్యం కాకూడదనేది తన లక్ష్యమన్నారు. తన మంచితనమే సినీరంగంలో ఇంతటి పేరును తెచ్చిందని చెప్పారు. స్థానిక తెలుగు పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని సమితి అధ్యక్షుడు ఎ.రాధాకృష్ణరాజు కర్ణాటక సర్కారుకు విజ్ఞప్తి చేశారు. సరదాకు మరోపేరు అలీ అని సమితి ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మిరెడ్డి అన్నారు. వెండితెర తారాజువ్వ అలీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: కమెడియన్ అలీతో హీరోయిన్ పెళ్లి, పత్రికల్లో ఫొటో! ఆమెతో లవ్ ట్రాక్, కానీ ఆ కమెడియన్‌కు ఆల్రెడీ పెళ్లైంది.. ఫొటోతో బయటపెట్టిన కంగనా -
అమరావతి నిర్మాణంలో మేము సైతం...
♦ బెంగళూరు నుంచి ఐదు వేల ఇటుకలు ♦ శ్రీరంగపట్టణం నుంచి త్రివేణి సంగమ జలాలు, పుట్టమన్ను ♦ అందరూ భాగస్వాములు కావాలని తెలుగు విజ్ఞాన సమితి పిలుపు బెంగళూరు(బనశంకరి) : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో కర్ణాటకలోని తెలుగు వారందరూ భాగస్వాములు కావాలని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధకృష్ణరాజు పిలుపునిచ్చారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘నా ఇటుక నా అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి ప్రజలను భాగస్వాములను చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు బెంగళూరు నుంచి అమరావతి నిర్మాణానికి 5 వేల ఇటుకలను పంపుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రవాసాంధ్రుడు వేదమూర్తి... శ్రీరంగపట్టణం నుంచి త్రివేణిసంగమ పవిత్రజలాలతో పాటు పుట్టమట్టిని తీసుకెళుతున్నట్లు వివరించారు. కర్ణాటక తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రుక్మాంగదనాయుడు మాట్లాడుతూ..... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అకుంఠితదీక్షతో చేపడుతున్న రాజధాని నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 22 తేదీన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఒక ఇటుక అందించి భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో కర్ణాటక తెలుగుదేశం పార్టీ బెంగళూరు కన్వీనర్ రావి మోహన్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.