ఓటుకు కోట్లు కేసులో ఉన్న ముద్దాయిలకు విజయవాడ షెల్టర్ జోన్గా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు.
ఓటుకు కోట్లు కేసులో ఉన్న ముద్దాయిలకు విజయవాడ షెల్టర్ జోన్గా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఈ కేసులో ఎ4గా ఉన్న మత్తయ్యకు బొండా ఉమామహేశ్వరరావు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆశ్రయం కల్పించారని ఆయన ఆరోపించారు.
కేసులోంచి బయట పడేందుకు పోలీసు అధికారులతో వారికి తర్ఫీదు ఇప్పిస్తున్నారని గౌతం రెడ్డి అన్నారు. తప్పు చేయకపోతే ఇలాంటి పాట్లు పడాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.