విష ప్రచారంతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ: విష ప్రచారంతో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అసహనం ఎవరిలో పెరిగిందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు.
దేశంలో మత అసహనం పెరిగిందని ప్రతిపక్షాలు, మేధావులు, కళాకారులు, రచయితలు విమర్శిస్తున్న నేపథ్యంలో వెంకయ్య స్పందించారు. ఎవరో ఒకరు చేసినదాన్ని దేశానికి అంటగట్టడం సరికాదని అన్నారు.