భారీ బ్రెడ్ | Venezuela lauds world records for Christmas dinner | Sakshi
Sakshi News home page

భారీ బ్రెడ్

Nov 17 2014 2:42 AM | Updated on Sep 2 2017 4:35 PM

భారీ బ్రెడ్

భారీ బ్రెడ్

మీటర్లకొద్దీ పొడవున్న బ్రెడ్‌ను మీరెప్పుడైనా చూశారా. చూడలేదేమో. అయితే ఇక్కడ చూడండి.

మీటర్లకొద్దీ పొడవున్న బ్రెడ్‌ను మీరెప్పుడైనా చూశారా. చూడలేదేమో. అయితే ఇక్కడ చూడండి. ఈ బ్రెడ్ పొడవు ఏకంగా 20 మీటర్లు. లోపలి వైపు పంది మాంసం ఉండే ఈ పొడవైన బ్రెడ్ బరువు 284 కేజీలు. శనివారం వెనిజులా దేశంలోని కారకస్ నగరంలో నిర్వహించిన ‘కుక్ ఎ థాన్’ కార్యక్రమంలో ఇంతటి భారీ బ్రెడ్‌ను తయారుచేశారు.

గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు దీనికి అధికారికంగా రికార్డు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంది. క్రిస్మిస్ సంబరాల్లో భాగంగా దేశ ఆహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 120 మీటర్ల పొడవైన లాటిన్ అమెరికా సంప్రదాయ వంటకం హల్లకా, 12,000 లీటర్ల చెరుకు, నిమ్మరసం మిశ్రమాన్ని సైతం గిన్నిస్ రికార్డులను బద్దలుకొట్టేందుకు తయారుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement