రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం | Vasundhara Raje takes oath as the new Chief Minister of Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ సీఎంగా వసుంధరా రాజె ప్రమాణ స్వీకారం

Dec 13 2013 1:32 PM | Updated on Sep 2 2017 1:34 AM

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్  మార్గరెట్ అల్వా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజె మరోసారి అధిరోహించారు. రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని  గవర్నర్  మంగళవారం వసుంధరా రాజేను  ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఎల్కె అద్వానీ,  పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement