మద్యంపై వ్యాట్ ఎత్తివేత! | value added tax on alcohol lifted in karnataka budget | Sakshi
Sakshi News home page

మద్యంపై వ్యాట్ ఎత్తివేత!

Mar 15 2017 4:37 PM | Updated on Sep 5 2017 6:10 AM

మద్యంపై వ్యాట్ ఎత్తివేత!

మద్యంపై వ్యాట్ ఎత్తివేత!

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలావరకు మద్యం ఉత్పత్తుల మీద వ్యాట్ ఎత్తేసింది.

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చాలావరకు మద్యం ఉత్పత్తుల మీద వ్యాట్ ఎత్తేసింది. వైన్, బీర్, హార్డ్ లిక్కర్ మీద ఈ పన్నును తీసేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక శాఖను కూడా తనవద్దే ఉంచుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులోనే ఆయన ఈ చర్యల గురించి చెప్పారు.

మద్యం మీద విలువ ఆధారిత పన్ను ఎత్తేయడంతో పాటు తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో 'నమ్మ క్యాంటీన్లు' ఏర్పాటు చేయనున్నట్లు కూడా సిద్దరామయ్య చెప్పారు. వీటిలో పేదలకు ఉదయం అల్పాహారం 5 రూపాయలకు, మధ్యాహ్న భోజనాన్ని 10 రూపాయలకు అందించనున్నారు. అలాగే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ. 5080 కోట్లు కేటాయించారు. అన్నభాగ్య పథకం కింద రాష్ట్రంలో పేద కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 కిలోల బియ్యం కోటాను 7 కిలోలకు పెంచారు. బడ్జెట్‌లో మొత్తం ఖర్చును రూ. 1.86 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement