గల్ఫ్‌ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం | union labour minister dattatreya met MEA sushma on gulf workers | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం

Jul 21 2017 9:29 PM | Updated on Aug 21 2018 3:10 PM

గల్ఫ్‌ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం - Sakshi

గల్ఫ్‌ కార్మికుల వివరాలు సేకరిస్తున్నాం

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల రక్షణపై చర్చించారు.

- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
- విదేశాంగ మంత్రి సుష్మాతో భేటీ.. కార్మికుల ఇబ్బందులపై చర్చ



ఢిల్లీ: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాద్రేయ శుక్రవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాల్లో భారత కార్మికుల రక్షణకు సంబంధించిన పలు కీలక విషయాలను ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికుల వివరాలు సేకరిస్తున్నామని సుష్మాకు దత్తాత్రేయ తెలిపారు.

ఏజెంట్ల మోసాలతో టూరిస్టు వీసాలపై వెళ్ళి చాలా మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని సుష్మా దృష్టికి తీసుకెళ్లినట్లు భేటీ అనంతరం మంత్రి దత్తాత్రేయ మీడియాకు తెలిపారు. మోసం చేసే సంస్థలు, ఏజెంట్లపైనా దర్యాప్తు చేపట్టడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సుష్మా హామీ ఇచ్చారని దత్తాత్రేయ వివరించారు. హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయ ఆధునీకరణపై సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement