కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ | Two soldiers and two militants killed today in encounter in Kupwara district of J-K | Sakshi
Sakshi News home page

కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్

Sep 11 2015 7:49 AM | Updated on Aug 25 2018 6:13 PM

కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ - Sakshi

కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్

పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఉగ్రమూక.. కుప్వారా జిల్లాలోని హడ్వారాలో శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

శ్రీనగర్: ఇటు భారత్- పాకిస్థాన్ సరిహద్దు భద్రతా దళాల మధ్య ఢిల్లీలో చర్చలు జరుగుతున్న వేళ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు.  గురువారం అర్థరాత్రి పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఉగ్రమూక.. కుప్వారా జిల్లాలోని హడ్వారాకు సమీపంలోని లరీబల్ గ్రామంలోకి ప్రవేశించింది.

ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సైన్యంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు కూడా ఉగ్రవాదులకు గట్టి సమాధం చెప్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం వరకు ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత పూర్తివివరాలు వెల్లడవుతాయిని పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement