మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్ | Two arrested for blackmailing woman with video | Sakshi
Sakshi News home page

మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్

Jul 29 2014 3:46 PM | Updated on Sep 2 2017 11:04 AM

మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్

మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్

మార్ఫింగ్ చేసిన వీడియోతో మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బార్మర్: మార్ఫింగ్ చేసిన వీడియోతో మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను లక్ష్మణ్రామ్, జంజారామ్ గా గుర్తించారు. బార్మర్ జిల్లాలోని ధోరిమన్నా ప్రాంతానికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు.

అశ్లీల దృశ్యాలతో తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి తనతో పలువురు మహిళలను బ్లాక్మెయిల్ చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన వీడియోలను ఇతరులకు కూడా నిందితులు పంపిణీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తునట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement