ఆ నరహంతకుడి అరెస్ట్ | Turkey has identified Istanbul nightclub attacker | Sakshi
Sakshi News home page

ఆ నరహంతకుడి అరెస్ట్

Jan 4 2017 5:15 PM | Updated on Sep 5 2017 12:24 AM

ఆ నరహంతకుడి అరెస్ట్

ఆ నరహంతకుడి అరెస్ట్

న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిపి 39 మందిని హతమార్చిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు టర్కీ విదేంశాగ మంత్రి కావ్ సోగ్లే బుధవారం మీడియాకు తెలిపారు.

ఇస్తాంబుల్: న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిపి 39 మందిని హతమార్చిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు టర్కీ విదేంశాగ మంత్రి కావ్ సోగ్లే బుధవారం మీడియాకు తెలిపారు. అయితే హంతకుడి  వివరాలు మాత్రం తెలుపలేదు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఉగ్రవాది కాల్పులకు ముందు కోన్యా సిటి సెంటర్‌లోని పరిసర ప్రాంతాల్లో ఒక హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తుంది.  అతను నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న ప్రముఖ రియానా హోటల్ లోకి శాంటాక్లాజా వేషధారణలో వచ్చి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో ౩9 మంది చనిపోయారు. మృతుల్లో లిబియాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, జోర్డాన్, ఇరాక్, ట్యునీషియా, మొరాకో పౌరులతో పాటు ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. మొత్తం 27 మంది విదేశీయులు మరణించారు. ఈ నైట్ క్లబ్ దురాగతం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఉగ్రవాది మధ్య ఆసియాకు చెందిన కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చినట్లు టర్కీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాది సిరియాలో శిక్షణ తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement