రైలు ప్రయాణికులకు మత్తు పానీయం | Train passengers to alcoholic beverage | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణికులకు మత్తు పానీయం

Aug 14 2015 1:52 AM | Updated on Aug 17 2018 7:48 PM

రైలు ప్రయాణికులకు మత్తు పానీయం - Sakshi

రైలు ప్రయాణికులకు మత్తు పానీయం

తోటి ప్రయాణికుడు ఇచ్చిన మత్తు పానీయం తాగిన హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

అపస్మారక స్థితిలోకి ప్రయాణికులు
విజయవాడ (రైల్వేస్టేషన్) : తోటి ప్రయాణికుడు ఇచ్చిన మత్తు పానీయం తాగిన హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హౌరా-చెన్నై (నంబర్ 12839 ) ైరె లు సెకండ్ క్లాస్  ఏసీ   ఏ1 కోచ్‌లో 25,26,27 బెర్త్‌ల్లో ఆర్‌డీ చెక్మా (52) ఎన్‌డీ చెక్మా (41), డీఎం చెక్మా (44) ప్రయాణిస్తున్నారు. వీరు చెన్నై వెళుతున్నారు. అన్నవరంలో అదే రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి జ్యూస్ ఇవ్వడంతో తాగిన వారంతా కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రైల్వే అధికారులు వారికి రాజమండ్రి స్టేషన్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో ఎస్కార్ట్ సహాయంతో విజయవాడకు అదే రైలులో తరలించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌లో వారిని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఎన్‌డీ చెక్మా స్పృహలోకి రావడంతో ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఇదే బోగీలో జి. బిస్వాస్ (బెర్త్ నంబర్ 28) అనే ప్రయాణికుడు చెన్నై వరకు టికెట్ తీసుకుని మధ్యలోనే దిగిపోవడంతో అతనే మత్తుపానీయాలు ఇచ్చాడా? అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement