ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సిటీబస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సిటీబస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో జరిగింది. నగరంలోని ఘోడ్‌బందర్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో చంద్రకాంత్ వామన్ సాలుంకే అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు టీఎంటీ బస్సు అతడిని ఢీకొంది.
దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడని కాసర్‌వాడావాలి పోలీసు స్టేషన్ పీఎస్ఐ ఆర్‌కే ధమానే తెలిపారు. మహారాష్ట్రలోని పర్నేర్ ప్రాంతానికి చెందిన సాలుంకే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం థానె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీఎంటీ బస్సు డ్రైవర్ గజానన్ షేజ్వాల్‌ను అరెస్టు చేశారు.