మోక్షం పొందాలంటే.. నాతో ఏకాంతంగా గడపాలి | To get salvation, you need to be alone with me says Yoga teacher | Sakshi
Sakshi News home page

మోక్షం పొందాలంటే.. నాతో ఏకాంతంగా గడపాలి

Jul 9 2017 2:22 PM | Updated on May 29 2019 2:59 PM

మోక్షం పొందాలంటే నాతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న యోగ గురువును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముబాయి: మోక్షం పొందాలంటే నాతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్న యోగ గురువును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సెవ్రిలో ఆదివారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన యోగ గురువు శివరాం రౌత్‌(57) తన వద్ద యోగ శిక్షణ తీసుకోవడానికి వచ్చిన ఓ మహిళను మోక్ష ప్రాప్తి కోసం తనతో ఏకాంతంగా గడపాలని కోరాడు. దీంతో భయందోళనలకు గురైన మహిళ తన భర్తతో కలిసి ఆర్‌.ఏ.కె మార్గ్‌ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి ఆదివారం వదాలలోని తన నివాసంలో యోగ గురువును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ.. తన వద్ద యోగ శిక్షణకు వస్తున్న పలువురు మహిళలతో రౌత్‌ ఈవిధంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. వారంతా భయంతో విషయం బయటకు చెప్పలేకపోయారు. ఇప్పుడు మరి కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement