యూపీలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం | Three-year-old raped by school van driver | Sakshi
Sakshi News home page

యూపీలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

Aug 24 2013 11:01 AM | Updated on Sep 15 2018 5:57 PM

యూపీలోని బహ్రుచ్ జిల్లాలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై పాఠశాల వ్యాన్ డ్రైవర్ అత్యాచారం చేశాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రుచ్ జిల్లాలో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ అనిల్ కుమార్ బెరియను శుక్రవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. స్కూల్ వ్యాన్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం ఆ చిన్నారితోపాటు పలువురు విద్యార్థులను డ్రైవర్ వ్యాన్లో స్కూల్కు తీసుకువెళ్లాడు. అయితే విద్యార్థులందరిని స్కూల్ వద్ద దింపాడు.

 

కానీ మూడేళ్ల చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆ చిన్నారిని ఇంటి వద్ద దింపాడు. ఆ చిన్నారి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో ఆ కుటుంబ సభ్యులకు ఆగ్రహాంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. గత అర్థరాత్రి నిందితుడిని పట్టుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.

 

నిందితునిపై దాడికి ఆ చిన్నారి కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపోరుగు వారి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement