మిని బస్సు- ట్రక్ ఢీ: ముగ్గురు మృతి | Three people injured in minibus accident at Surat | Sakshi
Sakshi News home page

మిని బస్సు- ట్రక్ ఢీ: ముగ్గురు మృతి

Aug 14 2013 12:58 PM | Updated on Aug 30 2018 3:56 PM

హజిర గ్రామ సమీపంలో మిని బస్సు, ఐరన్ లోడ్తో ఉన్న ట్రక్పైకి దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక ఎస్ఐ వెల్లడించారు.

గుజరాత్ రాష్ట్రంలోని హజిర గ్రామ సమీపంలో మిని బస్సు, ఐరన్ లోడ్తో ఉన్న ట్రక్పైకి దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని స్థానిక ఎస్ఐ  బుధవారం హజిరలో వెల్లడించారు. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారని తెలిపారు. వారిని హుటాహుటిన సూరత్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

 

అయితే వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఎస్ఐ వివరించారు. హజరి గ్రామ సమీపంలోని నెం 6 జాతీయ రహదారిపై నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు మృతి చెందారని తెలిపారు. గాయపడిన వారిలో 10 మందిని ప్రాధమిక చికిత్స అనంతరం వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారని ఎస్ఐ వివరించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement