బ్యాంకాక్ పేలుళ్ల ఘటన: పురోగతి శూన్యం | thers is no forward step on bangkok blasting episode | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్ పేలుళ్ల ఘటన: పురోగతి శూన్యం

Aug 20 2015 4:05 PM | Updated on Apr 3 2019 3:55 PM

ఇటీవల థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనకు ఇప్పటివరకూ ఎటువంటి ముందడుగు పడలేదు.

బ్యాంకాక్: ఇటీవల థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ముందడుగు పడలేదు. బ్యాంకాక్ బాంబు పేలుళ్ల సూత్రధారి విదేశీ వ్యక్తి కావొచ్చని అంచనాకు వచ్చిన థాయ్ పోలీసులు.. ఎటువంటి పురోగతి సాధించలేదు. దీంతో పాటు ఆ బాంబు పెట్టి వ్యక్తికి కనీసం పదిమంది స్థానికులు సహకరించినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.

 

బ్యాంకాక్ నగరంలోని బ్రహ్మదేవుడి ఆలయం వద్ద బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రాంగణంలో సంభవించిన పేలుడులో 27 మంది మరణించగా, 117 మంది గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement