రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా! | The hottest I saw in my last 3 births | Sakshi
Sakshi News home page

రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!

May 6 2016 9:26 PM | Updated on Sep 3 2017 11:32 PM

రాధికా ఆప్టే అందానికి.. రాం..  ఫిదా!

రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!

రాంగోపాల్ వర్మ కన్ను... ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు.

సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ కనిపించే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను...  ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీ సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టే అందాన్ని వర్ణిస్తూ రాం చేసిన ట్వీట్.. రాధికా అభిమానులను మరింత పెంచేట్టుగా ఉంది.

రాధికాను చూడగానే తాను డైరెక్ట్ చేసిన సినిమా గోవిందా గోవిందా సినిమాలోని పాట గుర్తుకు వచ్చిందని, ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ మరాఠీ బ్యూటీకి కొంతకాలం క్రితం విడుదలైన రక్త చరిత్ర సినిమాలో వర్మ...అవకాశం కూడ కల్పించాడు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో తన మనసులోని భావాలను  ''ఆహ్హాఆఆఆ! ది హాటెస్ట్  ఐ సా మై లాస్ట్ త్రీ బర్త్స్'' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement