breaking news
saw
-
రంపాలు మొలుస్తాయి
ఇంటి పిల్లాడు చాక్లెట్ కొనివ్వలేదనో, ట్యూషన్‌కు వెళ్లననో కాళ్లు నేల మీద గట్టిగట్టిగా తాటిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ దగ్గరకు తీసుకుని ‘అలా నేల మీద కాళ్లు రుద్దకు నాయనా. భూదేవికి నొప్పి పుట్టి ఏడుస్తుంది’ అని చెప్పేది. ఆ తర్వాత ఆ పిల్లాడు నేల మీద గట్టిగా నడవడానికి కూడా జంకేవాడు. తూనీగకు దారం కట్టి ఆడుతూ ఉంటే ‘పాపంరా... అలా చేయకు’ అని తల్లి కచ్చితంగా కోప్పడేది. ‘చీమల దారికి అడ్డంగా నీళ్ళు పోస్తారా ఎవరైనా... అవి ఇల్లు కట్టుకుంటున్నాయిరా’ అని అదిలించేవారు ఇంట్లో కచ్చితంగా ఉండేవారు. ‘చెట్టుమీద రాయి విసరకు. చెట్టుకు దెబ్బ తగులుతుంది’ అని గదమాయించే పెద్దలు ఇటూ అటూ సిద్ధం. ఇవన్నీ కేవలం పెద్దల మాటలు కాదు. పిల్లల గుండెలోకి కరుణను ఎక్కించే సూది మందులు. పిల్లాడి మణికట్టుపై కట్టే దయాదారాలు. తోటి ప్రాణి నొప్పిని తన నొప్పిగా భావించడం నేర్పే మొదటి బడి ఇల్లే. పిల్లాడు పెద్దయి బడికి వెళ్తే అక్కడ మరో తల్లి ఎదురయ్యేది.. టీచర్. ఆమె అక్షరాలతో పాటు కరుణను కూడా దిద్దించేది. అందరి వేళ్లూ తెగ నరికే అంగుళీమాలుడిని చూసి బుద్ధుడు ‘నేను ఆగిపోయాను.... నీవే ఆగాలి’ అని ఎలా ఆపాడో చెప్పేది. ‘నేను అన్ని ప్రాణులను హింసించడం ఆపేశాను. కరుణలో స్థిరంగా ఆగిపోయాను. కానీ నీవు ఇంకా హింసలో పరిగెడుతూనే ఉన్నావు’ అన్న బుద్ధుడి మాటల్లో కారుణ్యం క్లాస్‌రూమ్‌లో పిల్లల మనసులను తాకేది. గాంధీ తాత పరుగెత్తే గుర్రపు బగ్గీ కింద పడ్డ కుక్కపిల్ల కోసం పరీక్ష మానుకున్నారని చెప్తే మరువగలమా ఆ పాఠాన్ని? పిల్లల్లో ఇల్లు కరుణను నాటితే బడి దానికి నీళ్ళు పోసేది. ఆ తర్వాత సమాజం ఆ మొక్కను ఎదగనిచ్చేది.ఊళ్లో పెద్దల మాట అంటే హడల్. ఎవరు ఎవరి మీదైనా హింస చేస్తే పెద్దలు వాళ్లను పట్టుకొచ్చి రచ్చబండ దగ్గర రేవు పెట్టేవారు. అంటే మనం ఎవరినైనా బాధిస్తే సంఘం దృష్టిలో చులకనవుతామనే భయం నాటుకునేది. పశువును కొట్టినా పిట్టపై గులేర్ రాయి ఎక్కుపెట్టినా చెవి మెలేసే పెద్దలు పెట్టిన భయం మనసులో స్థావరం చేసుకునేది. చెట్టుకింత నీరు, పక్షికి నాలుగు గింజలు, ఆకలిగొన్నవాడికి పట్టెడు అన్నం... అదే జీవితం అని సంఘం పాఠం చెప్పేది. తన బలం, తన కోపం, తన ప్రేమ ఇతరులను నొప్పించడానికి వాడకూడదని అది గట్టిగా అర్థం చేయించేది.అదంతా గతం. ఇప్పుడు? అమ్మమ్మలు నానమ్మలు ఇళ్లల్లో ఉండటమే లేదు. తల్లిదండ్రులకు పిల్లలతో కూర్చుని కథ చెప్పేంత సమయం లేదు. ఫోనో, టాబ్లెటో ఇచ్చి వాళ్ల పరుగుల్లో వాళ్లున్నారు. దాంతో వాడు తూనీగకు దారం కట్టడం కాదు స్క్రీన్ మీద డ్రాగన్లను నరకడం నేర్చుకుంటున్నాడు. బడిలో విలువలు చెప్పాల్సిన టీచర్ సిలబస్ పూర్తి చేయడానికి తలమునకలవుతున్నాడు. పరీక్ష మార్కులే కొలతలుగా మారిన చోట మనిషితనానికి పడే మార్కుల ఊసే లేదు. ఇక సంఘం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీధిలో హత్య జరుగుతుంటే రీల్‌గా మార్చడంలో మజా అనుభవిస్తోంది. యువత వీటన్నింటి ప్రతిఫలంగా సినిమాల్లో రక్తపిపాస పెరిగింది. ఓటీటీల డార్క్ కంటెంట్. హీరో ఒక అమ్మాయిని వేధిస్తే అది ప్రేమగా, ఆమె కాదంటే పట్టుదలగా, ఆమెను కొడితే మగతనంగా చూపించే సినిమాలూ, వాటిని తీసే సినిమా బృందం జవాబుదారీతనంలేని వింత మృగాలవుతున్నారు. రంపాలు, గొడ్డళ్ళు, తుపాకులు హీరోయిజం సింబల్స్. మనిషిని చంపడం ఎంత ఈజీయో స్క్రీన్ మీద చూసి చూసి, పిల్లాడి మనసులో హింస ఒక సాధారణ విషయంగా మారిపోతోంది. అనంతపురం క్లాస్‌రూమ్‌లో రంపంతో దాడి చేసిన పిల్లాడు ఒక్కడే నేరస్తుడా? ఆ రంపాన్ని మనమే ఇచ్చాం. కరుణ నేర్పని ఇల్లు, విలువలు చెప్పని బడి, హింసను హీరోయిజం చేసిన సినిమా ఇచ్చింది. ‘వద్దు అంటే వదిలేయాలి’ అని చెప్పని సమాజం ఇచ్చింది. అందుకే అది ఒక పిల్లాడి నేరం కాదు, ఒక తరం వైఫల్యం. అంతా ముగిసిపోయింది కనుక మళ్ళీ మొదటి నుంచి మొదలు కావడమే మార్గం. అమ్మమ్మ మళ్ళీ గొంతు విప్పి దయ నేర్పాలి. టీచర్ మళ్ళీ బ్లాక్ బోర్డ్ మీద కరుణ రాయాలి. సంఘం తన అంతస్తును తాను పెంచుకోవాలి. అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది. ఖదీర్ -
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్‌లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్‌కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్‌లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
శ్రద్ధా కేసు: రంపంతోనే కోసినట్లు నిర్ధారణ
యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసి ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటి వరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)లో పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. గత నెలలో నిర్వహించిన డీఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా.. తదనంతరం వాటిని శవపరీక్షలకు పంపించారు. అలాగే ఆ ఫ్లాట్‌లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్లు నివేదికలో పేర్కొంది. ఈ మేరకు శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ నమునాను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా, నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గతేడాది నవంబర్ నుంచి కస్టడీలోనే ఉన్నాడు. ఈ నెలాఖారులోపు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో చార్జీషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. (చదవండి: శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్‌ని తరలిస్తున్న వ్యాన్‌పై దాడి... రక్షణగా ఉన్న పోలీసులకు రివార్డు) -
లారీ డ్రైవర్ కు కనిపించిన పులుల గుంపు..
-
అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరికలు: ఎమ్మెల్యే
కేతేపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని కొప్పోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హమీలను 90 శాతం అమలు చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించి గ్రామస్థాయి నుంచి పార్టీకి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో బచ్చలకూరి విక్రమ్, డి.శంకర్, బి.సైదులు, డి.సతీష్, నక్కల జాన్, బి.నాగయ్య, సీహెచ్.సైదులు, అనిల్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కె.వెంకటరమణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూజర్ల శంభయ్య, నాయకులు బి.సుందర్, కె.ఎల్లయ్య, కె.ఎల్లయ్య, దుర్గం శ్రవణ్, డి.నాగబాబు పాల్గొన్నారు. -
రాధికా ఆప్టే అందానికి.. రాం.. ఫిదా!
సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ కనిపించే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను... ఈసారి మరాఠీ అందాల భామ రాధికా అప్టేపై పడింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కబాలీ సినిమాలో నటిస్తున్న రాధికా ఆప్టే అందాన్ని వర్ణిస్తూ రాం చేసిన ట్వీట్.. రాధికా అభిమానులను మరింత పెంచేట్టుగా ఉంది. రాధికాను చూడగానే తాను డైరెక్ట్ చేసిన సినిమా గోవిందా గోవిందా సినిమాలోని పాట గుర్తుకు వచ్చిందని, ఇంతటి హాటెస్ట్ అమ్మాయిని ఇటీవల ఎక్కడా చూడలేదంటూ వర్మ తనదైన శైలిలో వర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ మరాఠీ బ్యూటీకి కొంతకాలం క్రితం విడుదలైన రక్త చరిత్ర సినిమాలో వర్మ...అవకాశం కూడ కల్పించాడు. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి వస్తున్న నేపథ్యంలో తన మనసులోని భావాలను ''ఆహ్హాఆఆఆ! ది హాటెస్ట్ ఐ సా మై లాస్ట్ త్రీ బర్త్స్'' అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు.Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births 😍 pic.twitter.com/KQ0wIWC2ZJ— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2016


