తొలిసారి ఎంపీహెచ్ కోర్సు | Sakshi
Sakshi News home page

తొలిసారి ఎంపీహెచ్ కోర్సు

Published Tue, Sep 29 2015 12:18 AM

The first course MPH

నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ

 సాక్షి, హైదరాబాద్ : ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సుకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కోర్సుకు ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. దీనికి వయోపరిమితి లేదు. 20 సీట్లు కన్వీనర్ కోటా కింద, 16 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు రెండేళ్లకు కలిపి రూ.2.25 లక్షలు, యాజమాన్య కోటా సీట్లకు కలిపి రూ.2.55 లక్షలు చెల్లించాలి.

దరఖాస్తుదారులు రూ. 3 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి. జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 18న ఆన్‌లైన్‌లో హైదరాబాద్, విజయవాడల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement