తూటా.. తాట తీస్తుంది.. | The Awesome New Bullet Billed as a 'One-Shot Manstopper' | Sakshi
Sakshi News home page

తూటా.. తాట తీస్తుంది..

Jan 30 2014 1:25 PM | Updated on Sep 2 2017 3:11 AM

తూటా.. తాట తీస్తుంది..

తూటా.. తాట తీస్తుంది..

ఇదో వినూత్నమైన బులెట్. ఇది ఒక్కటి వాడితే.. మరో బులెట్ వాడాల్సిన అవసరం లేదని దీన్ని తయారుచేసిన జీ2 రీసెర్చ్ అనే అమెరికా కంపెనీ చెబుతోంది.

 ఇదో వినూత్నమైన బులెట్. ఇది ఒక్కటి వాడితే.. మరో బులెట్ వాడాల్సిన అవసరం లేదని దీన్ని తయారుచే సిన జీ2 రీసెర్చ్ అనే అమెరికా కంపెనీ చెబుతోంది. బయటకు మామూలుగానే కనిపిస్తున్నా.. దీన్ని పేల్చితే.. శరీరంలోకి దూసుకుపోయిన తర్వాత ఇలా విచ్చుకుని.. చుట్టూ పక్కల ఉన్న కీలక అవయవాలవైపు దూసుకుపోతుంది. తద్వారా వాటిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అమెరికాలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు తమను, తమ ఇంటిని రక్షించుకోవడానికి దీన్ని తయారుచేశారట.

గతంలో దుండగులపై రెండుమూడు రౌండ్లు కాల్పులు జరిపినా.. వారు తమ వెంటపడిన సందర్భాలున్నాయని పలువురు బాధితులు చెప్పిన నేపథ్యంలో దీన్ని తయారుచేశామని జీ2 రీసెర్చ్ చెబుతోంది. రాడికల్లీ ఇన్వేసివ్ ప్రొజెక్టైల్(రిప్) అనే ఈ తూటా ఒక్కటి వాడితే చాలని.. అదే పెను నష్టాన్ని కలిగిస్తుందని.. మరో రౌండ్ అవసరముండదని.. మీ భద్రతకు మాది పూచీ అని హామీ ఇస్తోంది. ఈ బులెట్లను ఇటీవల లాస్‌వెగాస్‌లోని జరిగిన షాట్ షోలో ప్రదర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement