గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు | Telangana Ministers meet Digvijay singh at Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు

Dec 13 2013 8:17 PM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు.

హైదరాబాద్:  రాష్ట్ర విభజనపై తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రానికి పంపిన నేపథ్యంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తారని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు తెలంగాణ మంత్రులు తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ గౌరవిస్తారంటూ మంత్రులు డీకే అరుణ, సునీత, చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

అసెంబ్లీకి ఇవాళ తెలంగాణ బిల్లు రాకపోవడం వెనుక సీఎం కిరణ్ హస్తమేమీ లేదని దిగ్విజయ్ అన్నట్టు మంత్రులు తెలపారు. సోమవారం బీఏసీ భేటీలో బిల్లు చర్చకు వస్తుందిని, మంగళవారం నుంచే బిల్లుపై సభలో చర్చించేలా పట్టుబడతామని తెలంగాణ మంత్రులు డీకె అరుణ, సునీత, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement