గర్ల్‌ఫ్రెండుకు ఎస్ఎంఎస్ చేశాడని.. యువకుడి హత్య | teenager kills youth for sending sms to his girl friend | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండుకు ఎస్ఎంఎస్ చేశాడని.. యువకుడి హత్య

Dec 12 2016 9:11 AM | Updated on Sep 18 2019 3:26 PM

గర్ల్‌ఫ్రెండుకు ఎస్ఎంఎస్ చేశాడని.. యువకుడి హత్య - Sakshi

గర్ల్‌ఫ్రెండుకు ఎస్ఎంఎస్ చేశాడని.. యువకుడి హత్య

తన గర్ల్‌ఫ్రెండుతో తరచు మాట్లాడటంతో పాటు, ఆమెకు పదే పదే ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాడనే కోపంతో 24 ఏళ్ల యువకుడిని తన స్నేహితుడితో కలిసి చంపేశాడో యువకుడు.

తన గర్ల్‌ఫ్రెండుతో తరచు మాట్లాడటంతో పాటు, ఆమెకు పదే పదే ఎస్ఎంఎస్‌లు పంపుతున్నాడనే కోపంతో 24 ఏళ్ల యువకుడిని తన స్నేహితుడితో కలిసి చంపేశాడో యువకుడు. కత్తితో గొంతు కోసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. సల్మాన్  (24) ఢిల్లీలోని ఒక దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడి మృతదేహం దర్యాగంజ్‌లోని అతడి ఇంటి సమీపంలో పడి ఉంది. 
 
అతడి శరీరం మొత్తం కత్తిగాట్లు ఉన్నాయి. మెడ మీద బాగా లోతైన గాయం ఉంది. మైనర్లయిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాన్ కూడా నిందితులతో కలిసి తిరుగుతూ ఉండేవాడని, వాళ్లలో ఒకరి గర్ల్‌ఫ్రెండ్ ఇతడికి కూడా పరిచయమైందని చెప్పారు. అయితే ఆమె ఫోన్లో సల్మాన్ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఎస్ఎంఎస్‌లు ఉండటంతో నిందితుడికి బాగా కోపం వచ్చింది. దాంతో, తన స్నేహితుడితో కలిసి సల్మాన్‌ను గట్టిగా కొట్టి అతడికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. కానీ మధ్యలో ఏమైందో గానీ, ప్లాన్ మార్చుకుని కత్తితో గొంతు కోసి హతమార్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement