హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప | Technical University in Hyderabad, says KH Muniyappa | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప

Dec 23 2013 10:04 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప - Sakshi

హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ: మునియప్ప

హైదరాబాద్‌లో ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు ప్రత్యేక శిక్షణనిచ్చే సాంకేతిక విశ్వ విద్యాలయాన్ని(టెక్నికల్ వర్సిటీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు.

కోలారు(కర్ణాటక): ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు ప్రత్యేక శిక్షణనిచ్చే సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(టెక్నికల్ వర్సిటీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి కేహెచ్ మునియప్ప వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం కోలారులో కెనరా బ్యాంకు ఏర్పాటు చేసిన రుణ మేళాలో మంత్రి సోమవారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిపుణులైన కార్మికులను రూపొందించేందుకుగాను హైదరాబాద్‌లో టెక్నికల్ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని చెప్పారు. వర్సిటీ ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా సృజనాత్మకత కలిగిన నిపుణులు అందుబాటులోకి వస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement