వేద పాఠశాలలో టీచర్ కిరాతకం | teacher who beats eight years kid in veda pathaasala | Sakshi
Sakshi News home page

వేద పాఠశాలలో టీచర్ కిరాతకం

Sep 10 2015 3:33 PM | Updated on Sep 3 2017 9:08 AM

వేద పాఠశాలలో టీచర్ కిరాతకం

వేద పాఠశాలలో టీచర్ కిరాతకం

కర్నాటకలోని ఓ వేద పాఠశాలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల అక్కడ పనిచేసే టీచర్‌ అతి కిరాతకంగా వ్యవహరించాడు.

బెంగళూరు: కర్నాటకలోని ఓ వేద పాఠశాలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల అక్కడ పనిచేసే టీచర్‌ అతి కిరాతకంగా వ్యవహరించాడు. ఓ చేయి ఫ్రాక్చర్‌ అయిన ఆ బాలుడిని పట్టుకుని చెవి మెలేస్తూ... చితక్కొట్టాడు.  నిజానికి ఈ ఘటన చాలా రోజుల క్రితం జరిగింది. అయితే ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి.

 

నువ్వు బ్రాహ్మణుడివా, లేక క్షత్రియుడివా అంటూ బాలుడిని ఆ టీచర్‌ చావగొట్టినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని బంట్వాల్‌లో వున్న ఓ వేద పాఠశాలలో జరిగిన ఓ సంఘటన..  ఇప్పుడు సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనంగా మారింది.  జాతీయ స్థాయిలోనే కలకలం రేపుతోంది. దీనిపై  స్థానిక దళిత్‌ సేవాసమితి నాయకుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై బుధవారం కేసు నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement